Share News

బీసీ సదస్సును విజయవంతం చేద్దాం

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:15 PM

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ సాధించేందుకు సంఘటిత పోరాటం అనివార్య మని టీపీఎఫ్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ శంకర ప్రభాకర్‌ అన్నారు.

బీసీ సదస్సును విజయవంతం చేద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న టీపీఎఫ్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ ప్రభాకర్‌

  • టీపీఎఫ్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ ప్రభాకర్‌

గద్వాల టౌన్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ సాధించేందుకు సంఘటిత పోరాటం అనివార్య మని టీపీఎఫ్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ శంకర ప్రభాకర్‌ అన్నారు. ఆ దిశగా ఈ నెల 9న గద్వాలలో తల పెట్టిన జిల్లాస్థాయి బీసీ సదస్సును విజయవం తం చేయాలని కోరారు. సదస్సు నిర్వహణకు సంబంధించి మంగళవారం పట్టణంలోని టీజే ఎస్‌ కార్యాలయంలో సన్నాహక సమావేశం ని ర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడిన ప్రభా కర్‌, జనాభాలో 60శాతం పైగా ఉన్న బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సిందేనన్నా రు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ కుల సంఘాలు సాధిస్తున్న పోరాటానికి అన్నివర్గాల వారు అండగా నిలవా లన్నారు. పట్టణంలోని వాల్మీకి భవనంలో ఈ నెల 9న ఏర్పాటు చేసిన బీసీ సదస్సుకు నాయ కులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్య లో తరలిరావాలని కోరారు. సమావేశంలో బీఆ ర్‌ఎస్‌ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, అతిక్‌ఉర్‌ రెహమాన్‌, కురువ పల్లయ్య, జేఏసీ నాయకుడు, న్యాయవాది మధుసూదన్‌బాబు, ప్రజాసంఘాల నాయకులు వాల్మీకి, రెహ్మతు ల్లా, వినోద్‌, కృష్ణ, కృష్ణయ్య ఉన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:15 PM