Share News

జిల్లాను విద్యాపరంగా ముందు వరుసలో ఉంచుదాం

ABN , Publish Date - May 01 , 2025 | 11:28 PM

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నారాయణపేట జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించ డంపై ఆనందం వ్యక్తం చేస్తూ పీఆర్టీయూటీఎస్‌ నారాయణపేట జిల్లా శాఖ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు లును కలెక్టర్‌ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు పంపిణీ చేశారు.

జిల్లాను విద్యాపరంగా ముందు వరుసలో ఉంచుదాం
ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా పీఆర్టీయూ ఆధ్వర్యంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, డీఈవో గోవిందరాజులును సన్మానిస్తున్న నాయకులు

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేటటౌన్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నారాయణపేట జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించ డంపై ఆనందం వ్యక్తం చేస్తూ పీఆర్టీయూటీఎస్‌ నారాయణపేట జిల్లా శాఖ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు లును కలెక్టర్‌ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే, సంఘం నుంచి డీఈవో ద్వారా నోటు పుస్తకాలు, పెన్నులు కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయులు చక్కగా పని చేసి ఉత్తమ ఫలితాలు తీసుకురావడం పట్ల విద్యాశాఖకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే విద్యా సంవ త్సరం నుంచి ఇంకా మంచి ఫలితం కోసం కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయ బృందం సీ, డీ గ్రేడ్‌ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసు కోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో మధ్యాహ్న భోజనం కోఆర్డినేటర్‌ యాదయ్యశెట్టి, దామరగిద్ద ఎంఈవో కృష్ణారెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వై.జనార్దన్‌రెడ్డి, నారాయణపేట మండల అధ్యక్షుడు రఘువీర్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి జహీరొద్దీన్‌, పీఆర్టీయూ జిల్లా, రాష్ట్ర బాధ్యులు ప్రకాష్‌, నర్సింగ్‌ రావు, నరేందర్‌, అమృత, తిప్పన్న, ప్రసాద్‌రావు తదితరులున్నారు.

Updated Date - May 01 , 2025 | 11:28 PM