Share News

మరణించిన తరువాత కూడా సహాయపడదాం

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:27 PM

అవయవ దానం, శరీర దా నంతో మరణించిన తరువాత కూడా సహా యపడుదామని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌ అన్నారు.

 మరణించిన తరువాత కూడా సహాయపడదాం
చీర్ల రామచందర్‌ మృతదేహాన్ని మెడికల్‌ కళాశాలకు అప్పగిస్తున్న కుటుంబ సభ్యులు

- మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌

వనపర్తి వైద్యవిభాగం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అవయవ దానం, శరీర దా నంతో మరణించిన తరువాత కూడా సహా యపడుదామని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలకు చీర్ల రామచందర్‌ (81) అనే విశ్రాంత రైల్వే ఉ ద్యోగి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మెడి కల్‌ కళాశాలకు దానం చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.... మరణం అ నంతరం మెడికల్‌ కళాశాలకు మృతదేహం దానం చేయడం ద్వా రా విద్యార్థుల వైద్య వి ద్య అధ్యయనంలో పరి శోధనలో ఉపయోగక రంగా ఉంటుందన్నా రు. చీర్ల రామచందర్‌ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... ఇత రులకు సహాయపడా లన్న సామాజిక స్పృ హతో తమ తండ్రి బ తికుండగానే తన శరీరాన్ని మెడికల్‌ కళాశా లకు దానం చేసేందుకు అంగీకారం తెలిపా రని అన్నారు. తమ తండ్రి చివరి కోరిక మే రకే మృతదేహాన్ని మెడికల్‌ కళాశాలకు అప్ప గించామన్నారు. చీర్ల రామచందర్‌ కుటుంబ సభ్యులు, అనాటమీ హెచ్‌వోడీ డాక్టర్‌ హరి కృష్ణ, ప్రొఫెసర్‌ ఆనంద్‌ డేవిడ్‌, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 11:27 PM