Share News

ప్రతిభతో జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:05 AM

ప్రతిభతో పాటు నిత్యసాధన ద్వారా గద్వాల క్రీ డాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ప్రతిభతో జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఉత్సాహంగా ప్రారంభమైన క్రికెట్‌ టోర్నమెంట్‌

గద్వాల టౌన్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రతిభతో పాటు నిత్యసాధన ద్వారా గద్వాల క్రీ డాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గెలు పు, ఓటములను క్రీడాకారులు సమానంగా స్వీ కరించాలని, అదే నిజమైన స్ఫూర్తి అని అన్నా రు. ఆదివారం పట్టణ సమీపం రింగ్‌రోడ్డు వద్ద ఆదివారం నిర్వహించిన బీబీఆర్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-3 క్రికెట్‌ పోటీలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథి గా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఎమ్మెల్యే, మన ప్రాంతానికి చెందిన అనేకమంది కబడ్డీ, క్రికెట్‌ క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని, వారి స్ఫూర్తితో భవిష్యత్‌లో ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఎంపిక కా వాలని ఆకాంక్షించారు. యువకులు విద్యతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోని ప్రవేశించిండం ద్వారా బహుముఖ ప్రజ్ఞావంతులుగా నిలవాల న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎండీ బాబర్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ నరహరి శ్రీనివాసులు, నాయకులు దివాకర్‌ రెడ్డి, అన్వర్‌, మౌలానా ఉన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:05 AM