Share News

42శాతం రిజర్వేషన్‌ సాధనకు పోరాడుదాం

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:02 PM

బీసీలకు 42శాతం రిజర్వేసన్‌ అమలు పోరాటంతోనే సాధ్యమవుతుందని బీసీ జేఏసీ కమిటీ చైర్మన్‌ బెక్కెం జనార్దన్‌ పేర్కొన్నారు.

42శాతం రిజర్వేషన్‌ సాధనకు పోరాడుదాం
మాట్లాడుతున్న బీసీ జేఏసీ కమిటీ చైర్మన్‌ బెక్కెం జనార్దన్‌

పాలమూరు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు 42శాతం రిజర్వేసన్‌ అమలు పోరాటంతోనే సాధ్యమవుతుందని బీసీ జేఏసీ కమిటీ చైర్మన్‌ బెక్కెం జనార్దన్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన బీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్‌ సాధనకు అలుపెరగని పోరాటం చేయాలని, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరాటంలో ప్రతీ బీసీ కుల సంఘం భాగస్వామ్యం కావాలన్నారు. బీసీ నాయకులు, కుల సంఘాలు, బీసీలు ఆర్గనైజేషన్‌ సభ్యులందరూ ఏకం కావటానికి బీసీ జేఏసీ ఏర్పడిందన్నారు. బీసీ జేఏసీ కన్వీనర్‌గా కోరమోని వెంకటయ్య, పాండురంగం, శేఖరాచారి, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, లక్ష్మీకాంత్‌, కిన్నెర శేఖర్‌, గంగాధర్‌, వెంకట్రాములు, సారంగం లక్ష్మీకాంత్‌, వెంకట్రాములు, విజయకుమార్‌, మహేందర్‌, మున్నూరు రాజు, పురుషోత్తం, రాంచందర్‌జీ, రమేష్‌, సాయిలుయాదవ్‌, మైత్రియాదయ్య, ప్రేమ్‌సాగర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 11:03 PM