ప్రజాసమస్యలపై నిరంతరం పోరు సాగిద్దాం
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:25 PM
నడిగడ్డలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం గా నిరంతరం పోరాటం సాదిద్దామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ అన్నారు.
ఎన్‌హెచ్‌పీఎస్ జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్
గద్వాల టౌన్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నడిగడ్డలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం గా నిరంతరం పోరాటం సాదిద్దామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ అన్నారు. రానున్న స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోరాట సమితి తరఫున పోటీ చేసేందుకు యువత సిద్ధం కావాలని పిలుపుని చ్చారు. శుక్రవారం స్థానిక జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్‌లో జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడిన రంజిత్‌కుమార్, దశాబ్దాల తరబడిగా సీడ్ పత్తి రైతులను మో సగిస్తున్న ఆర్గనైజర్లకు వ్యతిరేకంగా పోరాడు తున్న తాము రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటామ న్నారు. గతంలో చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేసినట్లు వివరించారు. వాటితో పాటు ఓటు చైతన్యయాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. తమ పోరాట ఫలితంగానే పలు గ్రామాల్లో సమస్యలు పరి ష్కారమయ్యాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత సిద్ధం కావాలని సూచించారు. సమావేశంలో పోరాట సమితి కన్వీనర్ బుచ్చిబాబు, కార్యదర్శి లవన్న, నాయకులు వెంకట్రాములు, జమ్మన్న, విష్ణు, బలరాం నాయుడు, మునెప్ప, గోవిందు, అడవి ఆంజనే యులు, విజయ్‌కుమార్, దయాకర్, నజీముల్లా, కృష్ణ, రాము, సుభాన్, రంగస్వామి, సుదర్శన్, గోపాల్ ఉన్నారు.