గద్వాల ఫుట్‌బాల్ క్రీడా వైభవాన్ని కొనసాగిద్దాం
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:27 PM
గ ద్వాల ఫుట్‌బాల్ క్రీడావైభవాన్ని కొనసాగించేం దుకు ప్రతీ క్రీడాకారుడు పునరంకితం కావాలని గద్వాల ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు అన్నారు.
సైకిల్‌యాత్రగా మంత్రాలయం తరలిన క్రీడాకారులు
గద్వాల టౌన్/అయిజ టౌన్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): సంస్థానాదీశుల కాలం నుంచి ఫుట్‌బాల్ క్రీడకు ప్రసిద్ధిగాంచిన నడిగడ్డలో గ ద్వాల ఫుట్‌బాల్ క్రీడావైభవాన్ని కొనసాగించేం దుకు ప్రతీ క్రీడాకారుడు పునరంకితం కావాలని గద్వాల ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు అన్నారు. గద్వాల జి ల్లాకు ప్రత్యేక ఫుట్‌బాల్ అసోసియేషన్ ఏర్పా టు చేసిన నేపథ్యంలో స్థానిక ఫుట్‌బాల్ సీని యర్, జూనియర్ క్రీడాకారులు పెద్దసంఖ్యలో మంత్రాలయానికి సైకిల్‌యాత్ర చేపట్టారు. స్థా నిక తేరుమైదానం సమీపంలోని గుంటి చెన్నకే శవస్వామి ఆయలం వద్ద సైకిల్‌యాత్రను శుక్రవారం అసోసియేషన్ సెక్రటరీ విజయ్‌కు మార్‌తో కలిసి బండల వెంకట్రాములు ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువు రు క్రీడాకారులు జిల్లాకు ప్రత్యేక ఫుట్‌బాల్ అ సోసియేషన్ అందుబాటులోకి రావాలన్నది గడి చిన ఆరేళ్లుగా తాము ఎదురుచూస్తున్న కోరిక అని, మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి ఆశీ స్సులతో తమ కల నెరవేరినందున స్వామివారి దర్శనానికి వెళుతున్నట్లు తెలిపారు. యాత్రకు బయలుదేరిన వారిలో ఇండికా శివ, విజయ్, జ గన్, జయసింహ, ప్రశాంత్,ఎర్రవల్లి శ్రీను, పాం డు, స్వామి, హరి, రామకృష్ణ, ఉదయ్ ఉన్నారు. సైకిల్ యాత్రగా అయిజకు చేరుకున్న క్రీడాకా రులకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నిమ్మరసం పంపిణీ చేశారు.