పండుగ సాయన్న ఆశయాలు కొనసాగిద్దాం
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:15 PM
పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిద్దామ ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ పిలుపునిచ్చారు.
పాలమూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిద్దామ ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ పిలుపునిచ్చారు. గు రువారం పండుగ సాయన్న జయంతి సందర్భం ా జిల్లా కేంద్రంలో, హన్వాడ మండలం లో సాయన్న విగ్ర హానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పండుగ సాయన్న ఎక్కడుంటే అక్కడ పండుగ వాతావరణం ఉండే దన్నారు. సల్లోనిపల్లి బాలయ్య, చెన్నయ్య, బోడ నరేందర్, కొండ బాలయ్య, ల క్ష్మయ్య, యాదయ్య, నరసింహా పాల్గొన్నారు.
హన్వాడ : మండల కేంద్రంతో పాటు వేపూర్, బుద్దారం గ్రామాల్లో గురువారం పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. హన్వాడలో ఆయన విగ్రహనికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, పండుగ సాయన్న కమిటీ నాయకులు పాల్గొని పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మండల అఽధ్యక్షులు మహేందర్, కరుణాకర్‌గౌడ్, కొండ లింగన్న, పండుగ సాయన్న కమిటీ మండల అధ్యక్షుడు యాదయ్య, నాయకులు చెన్నయ్య, నరేందర్, లక్ష్మయ్య, రమణారెడ్డి, శేఖర్, బుచ్చిరెడ్డి, జంబులయ్య, నాగన్న, రఘురాంగౌడ్, బాలయ్య, బాలరాజు, కృష్ణయ్యగౌడ్, అంజన్న పాల్గొన్నారు.
కోయిలకొండ : తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న సేవలు మరువలేనివని ము దిరాజ్ సంఘం మండల నాయకులు మాధవులు, ఆంజనేయులు అన్నారు. గురువారం మం డలంలోని కొతలాబాద్‌లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యాలయంలో పండుగ సాయన్న చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.