మహాత్ముడి ఆశయాలు కొనసాగిద్దాం
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:30 PM
జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి, స్వాతంత్య్ర సమరయోధుడు భారత రెండో ప్రధాని లాల్‌బహదూర్‌శాస్ర్తి 121వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో వారి చిత్రపటాల కు ఎస్పీ శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
గద్వాల క్రైం : జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీ స్ కార్యాలయంలో గురువారం జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి, స్వాతంత్య్ర సమరయోధుడు భారత రెండో ప్రధాని లాల్‌బహదూర్‌శాస్ర్తి 121వ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో వారి చిత్రపటాల కు ఎస్పీ శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... జాతిపిత మహాత్మాగాంధీ తన సిద్దాంతైన సత్యం, అహింసాతో దేనినైనా సాధించవచ్చు అని నమ్మిన వ్యక్తి అని, సత్యాన్ని, అ హింసను పాటించడంలో ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. అలాగే లాల్ బహుదూర్‌శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలచ్చి దేశానికి సైనికుల, రైతుల గొ ప్పతనాన్ని తెలియజేసిన వ్యక్తి అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతీ యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.
- చింతలపేటలో ఎమ్మెల్యే బండ్ల నివాళి
గద్వాల టౌన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): శాంతియుత సహజీవనం, దేశ సమగ్రత, సమై క్యతలే లక్ష్యంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ 156వ జయంతిని పురస్కరిం చుకుని గురువారం పట్టణంలోని చింతలపేటలో గల దివంగత బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూ లమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్లు, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సాయిశ్యా మ్ రెడ్డి, నరహరి శ్రీనివాసులు ఉన్నారు.