మహబూబ్‌నగర్ స్థాపన వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:37 PM
గంగ జమున తహ్‌జిబ్ చాటేలా మహబూబ్‌నగర్ స్థాపన వేడుకలను నిర్వహిద్దామని పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు అన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గంగ జమున తహ్‌జిబ్ చాటేలా మహబూబ్‌నగర్ స్థాపన వేడుకలను నిర్వహిద్దామని పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు అన్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ వ్యవస్థపాకుడు అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలోని మహెబూబియా హాల్‌లో మహబూబ్‌నగర్ ఆవతరణ దినోత్సవ వేడుకల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ 135 ఏళ్ల ప్రస్తానాన్ని, నగర స్థాపకుడు ఆసఫ్ జాహ్ నవాబ్ మీర్ మహెబూబ్‌అలీఖాన్ సేవలను ప్రజలకు తెలియజేద్దామఔన్నారు. డిసెంబరు 4వ తేదీన మహబూబ్‌నగర్ స్థాపన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ వ్యవస్థపాకుడు అబ్దుల్‌రహీం మాట్లాడుతూ త్వరలోనే వార్షికోత్సవ కార్యక్రమాల వివరాలు ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌హదీ, ఆయా పార్టీల, సంఘాల నాయకులు అన్వర్‌పాషా, రఫీక్ పటేల్, అబ్దుల్‌జకీ, మహ్మద్‌ఖలీల్, సమాద్‌ఖాన్, మహ్మద్‌బషీర్, మీర్ షోయబ్‌అలీ, అబ్దుల్లా, జహంగీర్‌పాషఖాద్రీ, మహ్మద్ అయూబ్, ఇలియాజ్ పాల్గొన్నారు.