చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు అమలు చేయాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:40 PM
శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బీసీలకు చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లను అమలు చేయాలని జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడుబూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు.
నారాయణపేట రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బీసీలకు చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లను అమలు చేయాలని జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడుబూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేసేలా ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. 42శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంకటేశ్ యాదవ్, కుర్మయ్య, గణేష్, రాంచందర్, రాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.