Share News

అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:31 PM

అక్రమాల కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయాధికారి సక్రియా నాయక్‌ అన్నారు.

అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

- జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయాధికారి సక్రియానాయక్‌

అయిజ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అక్రమాల కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయాధికారి సక్రియా నాయక్‌ అన్నారు. మంగళవారం అయిజ మండల పరిధిలోని ఎక్లాస్‌పూర్‌లోని రైతువేదికలో ఎరు వులు, విత్తనాలు, మందుల అమ్మకం దారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతు సం బంధిత విత్తనాలు, ఎరువులు, మందులు విక్రయించిన తర్వాత రశీదు అందజేయాలని ఆదే శించారు. కల్తీలు విక్రయిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్బంగా తెలియజేశారు. ఎమ్మార్పీకే విక్రయించాలని, అధిక ధరలకు వి క్రయించిన, అక్రమాలకు పాల్పడిన అనుమతు లు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి జనార్దన్‌ ఉన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 11:31 PM