Share News

నిబద్ధతకు ప్రతిరూపం లక్ష్మణ్‌ బాపూజీ

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:41 PM

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ నిబద్ధతకు ప్రతిరూపమని పద్మశాలి సంఘం జిల్లా అధ్య క్షుడు, మాజీ కౌన్సిలర్‌ పులిపాటి వెంకటేష్‌ కీ ర్తించారు.

నిబద్ధతకు ప్రతిరూపం లక్ష్మణ్‌ బాపూజీ

  • పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేశ్‌

  • ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి

గద్వాలటౌన్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సొంత రాష్ట్రం సాధించే వరకు ఎలాంటి పదవు లను స్వీకరించేది లేదని మంత్రి పదవిని వదు లుకుని జీవితాంతంఅదే మాటకు కట్టుబడిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ నిబద్ధతకు ప్రతిరూపమని పద్మశాలి సంఘం జిల్లా అధ్య క్షుడు, మాజీ కౌన్సిలర్‌ పులిపాటి వెంకటేష్‌ కీ ర్తించారు. బాపూజీ వర్ధంతిని పురస్కరించుకు ని ఆదివారం సంఘం ఆధ్వర్యంలో పట్టణం లోని దివంగత నాయకుడి విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బం గా మాట్లాడిన పులిపాటి వెంకటేశ్‌, బాపూజీ సేవలకు గుర్తింపుగా అసెంబ్లీ ఎదురుగా ఆయ న కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, నేటి తరానికి ఆయన జీవిత చరిత్ర అందేలా పా ఠ్యాంశంగా పొందుపరచాలని ప్రభుత్వాన్ని కో రారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ అక్కల రమాదేవి, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి మ్యాడం రామకృష్ణ, చిన్ని నాగ రాజు, సంఘం పట్టణ అధ్యక్షుడు నామాల శ్రీకాంత్‌, సాయిబాబ, శ్యాం, రఘ, కృష్ణ, గోపా ల్‌, శేఖర్‌, ఆంజనేయులు, పరశురాం, విశ్వనాథ్‌, శశిభూషణ్‌ ఉన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:41 PM