సీజేఐపై న్యాయవాది దాడి గర్హనీయం
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:20 PM
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై న్యాయవాది చేసిన దాడి గర్హనీయ మని, బాధ్యులైన వ్యక్తిని వెంటనే న్యాయవాద వృత్తి నుంచి తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
గద్వాలలో ప్రజా సంఘాల నిరసన
నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన
గద్వాల టౌన్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై న్యాయవాది చేసిన దాడి గర్హనీయ మని, బాధ్యులైన వ్యక్తిని వెంటనే న్యాయవాద వృత్తి నుంచి తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీజేఐపై దాడిని నిరసిస్తూ సోమవారం పట్టణంలోని కృష్ణవేణి సర్కిల్‌లో ప్రజా, దళిత, ఉపాధ్యాయ, బహుజన సంఘాల నాయకులు నల్లబ్యాడ్జిలతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన తెలం గాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ ప్రభాకర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, న్యాయమూరిపై దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. రా జ్యాంగం, న్యాయ వ్యవస్థపైనే దాడిగా పరిగణించి, బాధ్యుడైన న్యాయవాదిని తక్షణం ఆ వృత్తి నుంచి తొలగించాలని, కఠిన చర్యలు తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో ఆర్.మోహన్, కురువ పల్లయ్య, మాల శ్రీనివాస్, రాజు, వాల్మీకి, నాగన్న ఉన్నారు. అలాగే సీజేఐపై దాడిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కా ర్యదర్శి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.