Share News

ప్రాథమిక స్థాయి నుంచి భాషా బోధన చేయాలి

ABN , Publish Date - May 25 , 2025 | 11:07 PM

ప్రాథమిక స్థాయి నుంచి తెలుగుతో పాటు హిందీభాషా బోధన చేయాలని బహుజన క్లాస్‌ టీచర్‌ అసో సియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఎన్‌ విజయ్‌కుమార్‌ అన్నారు.

ప్రాథమిక స్థాయి నుంచి భాషా బోధన చేయాలి

- బహుజన క్లాస్‌ టీచర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఎన్‌ విజయ్‌కుమార్‌

అయిజ, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక స్థాయి నుంచి తెలుగుతో పాటు హిందీభాషా బోధన చేయాలని బహుజన క్లాస్‌ టీచర్‌ అసో సియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఎన్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం అయిజలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన పండితులు అయిన తెలుగు, హిందీ అప్‌గ్రేడేష న్‌ పోస్టులు దాదాపు 800 ఉన్నాయని పదోన్నతుల ద్వారా అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం పదోన్నతులు, బదిలీల్లో అన్ని కేటగిరీల వారీగా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రతీ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌, వాచ్‌మెన్‌లు, స్కావెంజర్సు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే వంట ఏజెన్సీలకు నిధులు ముందస్తుగా విడుదల చేయాలని కోరారు. పాఠశాలలకు నిధులు సకాలంలో విడుదల చేస్తూ విద్యాభివృద్ధికి ప్రభు త్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను, పీఆర్సీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా పూర్తి చేయాలన్నారు. మండల విద్యాధికారులచే డీఈవోలను, డిప్యూటీ డీఈవోలను భర్తీ చేయాలని తెలిపారు. రిటైర్డు అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు పెట్టుకున్న జీపీఎఫ్‌ పార్టు ఫైనల్‌ విధులు వెంటనే చెల్లించాలని, పెండింగ్‌ బకాయిలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ఎస్‌ఏ హిందీ ఉపాధ్యాయులు ప్రభాకర్‌, అరుణ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:07 PM