Share News

భూ సమస్యలు పరిష్కరించుకోవాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:22 PM

రైతులు రెవెన్యూ సదస్సుల ద్వారా తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు.

భూ సమస్యలు పరిష్కరించుకోవాలి
మల్లెబోయిన్‌పల్లిలో ఫిర్యాదు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

- అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

జడ్చర్ల/రాజాపూర్‌/బాలానగర్‌/భూత్పూర్‌/హన్వాడ/గండీడ్‌/మూసాపేట/నవాబ్‌పేట, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : రైతులు రెవెన్యూ సదస్సుల ద్వారా తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లిలో మంగళవారం రెవెన్యూ సదస్సులో పాల్గొని, మాట్లాడారు. తహసీల్దార్‌ నర్సింగ్‌రావు పాల్గొన్నారు. రాజాపూర్‌ మండల కేంద్రంలో తహసీల్దార్‌ రాధాకృష్ణ, డీటీ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు 27 దరఖాస్తులు రాగా, అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు పరిశీలించారు. బాలానగర్‌ మండలం తిరుమలగిరి, హేమాజీపూర్‌ గ్రామాల్లో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, నయాబ్‌ తహసీల్దార్‌ లిఖితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు 224 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. భూత్పూర్‌ మండలం కొత్తమొల్గర, తాటిపర్తి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 96 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్‌ కిషన్‌నాయక్‌, డీటీ గీత తెలిపారు. హన్వాడ మండలం పెద్దదర్పల్లి, దాచకపల్లి గ్రామాల్లో తహసీల్దార్‌ కిష్ట్యానాయక్‌, డీటీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గండీడ్‌ మండలం మన్సుర్‌పల్లి, రుసుంపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 33 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్‌ మల్లిఖార్జున్‌రావు తెలిపారు. అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు 83 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్‌ శేఖర్‌ తెలిపారు. నవాబ్‌పేట మండలం తీగలపల్లి, సిద్దోటం గ్రామాల్లో తహసీల్దార్‌ శ్రీనివాసులు, డీటీ సువర్ణ ఆధ్వర్యంలో చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో 29 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Updated Date - Jun 10 , 2025 | 11:22 PM