భూభారతి దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:06 PM
పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగంగా పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగంగా పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్‌హాలులో తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్‌లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు. ఇంకా ఎన్ని పెం డింగ్‌లో ఉన్నాయనే విషయాలపై ఆరాతీశారు. భూ భారతి రెవెన్యూ సదస్సులతో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించా రు. వచ్చిన దరఖాస్తులు ఆరు నెలలు దాటిన తర్వాత వాటిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొ ని వెంటనే పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నా రు. ఆర్డీవో, తహసీల్దార్‌ల లాగిన్‌లలో పెండిం గ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేయాలన్నారు. భూభారతి దరఖాస్తులలో ప్రభుత్వ భూములు, కాలువలకు సంబంధించిన అంశాలు ఉంటే స ర్వేయర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. దరఖాస్తులను తి రస్కరించే ముందు సృష్టమైన కారణాలను తెలియజేస్తూ రిజెక్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశించా రు. రెవెన్యూ కార్యాలయంలో ఆదాయం, కుటుం బ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్లను నిర్ణీత సమయంలో జారీ చేయాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ అలివేలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ రాంచందర్, తహసీల్దార్లు ఉన్నారు.