భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:29 PM
ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు మిగిలిన భూ సేకరణ పనులు వేగవంతం చే యాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికా రులను ఆదేశించారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు మిగిలిన భూ సేకరణ పనులు వేగవంతం చే యాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికా రులను ఆదేశించారు. శుక్రవారం కలె క్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో భూ సేకరణ, భూ నిర్వాసితుల పునరావాస ఏర్పా ట్లపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుద్దారం పెద్ద చెరువు, గణప సముద్రం బ్యాలె న్సింగ్ రిజర్వాయర్‌కు సంబంధించిన భూ సేక రణపై ప్రధానంగా చర్చించారు. బుద్దారం పెద్ద చెరువుకు సంబంధించిన 11.57 ఎకరాల భూమి కి వారం రోజుల్లో అవార్డ్ పాస్ చేయాలని అ నంతరం వెంటనే ధరణి పోర్టల్‌లో నమోదు చే యాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవె న్యూ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇరిగే షన్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు కేశవరావు, మిగతా డీఈలు తదితరులు పాల్గొన్నారు.