ప్రాజెక్ట్ పరిధిలో భూసేకరణ పూర్తి చేయాలి
ABN , Publish Date - May 20 , 2025 | 11:25 PM
జ వహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను త్వర గా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అ ధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, మే 20 (ఆంధ్రజ్యోతి): జ వహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను త్వర గా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అ ధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవో సీ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో ఇరిగేషన్, రెవె న్యూ శాఖల అధికారులతో పెండింగ్ ఆయకట్టు భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు కింద పెండింగ్‌లో ఉన్న 480 ఎకరాల భూసేకరణపై చర్యలు తక్షణమే ప్రారంభించాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ వారిగా తహసీల్దార్, రెవె న్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్.ఐ), మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతోకూడిన ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి భూసేకరణను వేగవంతం చేపట్టాలని ఆదేశించారు. భూమికి పరిహారం చెల్లించిన వెంటనే సివి ల్ వర్క్స్ ప్రారంభించాలని స్పష్టం చేశారు. కా లువల నిర్మాణం వల్ల గ్రామాల అభివృద్ధి, సా గు సౌకర్యాలు ఎలా మెరుగవుతాయో ప్రజలకు వివరించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ప్రాం తాలను స్వయంగా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ రహీముద్దీన్, అధికారులు ఉన్నారు.