సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి చేయాలి
ABN , Publish Date - May 22 , 2025 | 11:16 PM
పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తి పోతల ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ పనులను
-ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జీ రవినాయక్
నాగర్‌కర్నూల్, మే 22 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తి పోతల ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జీ రవినాయక్, కలెక్టర్ బదావత్ సంతోష్‌లు ఆదేశించారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా సాగునీటి పారుదల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్, సర్వే ల్యాండ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మ డి జిల్లా ప్రత్యేక అధికారి జీ రవినాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ఉందని, సం బంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని సూ చించారు. జిల్లాలోని వివిధ ప్యాకేజీలల్లో జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణలో సమస్యలు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సందర్శించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చే యాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన మహాత్మాగాంధీ, కల్వకుర్తి పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మార్కండేయ, అచ్చంపేట, కర్నేతండా, డిండి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణను, జిల్లాలో ఆయా సాగునీటి ప్రాజె క్టులను పూర్తి చేసేందుకు చివరి దశకు అవసరమైన భూసేకరణను వేగవంతం చే యాలని తెలిపారు. సమావేశంలో నీటిపారుదల అధికారులు సీఈ విజయ్ భా స్కర్, ఎస్‌ఎన్‌రెడ్డి, ఈఈలు శ్రీకాంత్, మురళి, ఆర్డీవోలు మాధవి, భన్సీలాల్, సురేష్, శ్రీనివాసులు, సర్వే అధికారి సరిత, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.