సాహసానికి ప్రతీక లక్ష్మీబాయి జీవితం
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:32 PM
లక్ష్మీబాయి
నారాయణపేటరూరల్/నారాయణపేట టౌన్/మక్తల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సాహసానికి ప్రతీక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితమని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం భారతి అన్నారు. బుధవారం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పేట మం డలం జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 55మంది విద్యార్థినులు ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. విద్యార్థినులు ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ధైర్యం, క్రమశిక్షణతో ఎదగాలని హెచ్‌ఎం భారతి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుసూదన్, భానుప్రకాశ్, మంగళ, శ్రీదేవి, శిరీష, నిర్మల, శశిరేఖ, ప్రతాప్, నర్సింహులు తదితరులున్నారు.
అదేవిధంగా, పేట పట్టణంలోని శ్రీసాయి స్కూల్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పా ఠశాల కరస్పాండెంట్ సాయిలీల పూలమాల వే సి నివాళులు అర్పించారు. ప్రిన్సిపాల్ బాలప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మక్తల్ పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి చౌర స్తాలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో, అలాగే ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియ ర్ కళాశాల వద్ద ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు నిర్వహించారు. హిందూ ధార్మిక సం ఘాల నాయకులు రాంమాధవ్, మహేష్‌సాగ ర్, శివకుమార్, భీమేష్, భరత్, వాకిటినర్సింహ, ఆనంద్, ఆంజనేయులు, బాలప్ప, అశోక్, బస్వ రాజ్, ఎం.నర్సింహ, నరేష్ పాల్గొన్నారు.