Share News

కురుమూర్తికి రూ.84.13 లక్షల ఆదాయం

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:31 PM

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో ని కురుమూర్తి వేంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి రూ.84,13,144 హుండీ ఆదా యం లభించింది.

కురుమూర్తికి రూ.84.13 లక్షల ఆదాయం
ఆలయ ప్రాంగణంలో హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది, కురుమూర్తి స్వామి సేవకులు

గత ఏడాది కంటే 4.44 లక్షలు అధికం

చిన్నచింతకుంట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో ని కురుమూర్తి వేంకటేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి రూ.84,13,144 హుండీ ఆదా యం లభించింది. హుండీని మూడు సార్లు లెక్కించగా ఈ ఆదాయం వచ్చింది. ఈనెల 3న మొదటి సారి లెక్కింపులో 28,70,536 ఆదాయం రాగా, 11న రెండో సారి లెక్కింపు సందర్భంగా 24,83,628 ఆదాయం వచ్చింది. సోమవారం మూడో సారి హుండీని లెక్కించగా రూ.30,58,980 ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గత ఏడాది రూ.79,68,810 ఆదాయం రాగా, సారి గతం కంటే 4,44,334 ఆదా యం అధికంగా వచ్చింది. హుండీ లెక్కింపులో మదనేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, పాలకవర్గం సభ్యులు, ఆలయ సిబ్బంది, కురుమూర్తి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:31 PM