Share News

తలాపున కృష్ణమ్మ.. తాగు నీరు లేదమ్మా!

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:35 PM

తలాపునే కృష్ణమ్మ పారుతున్నా.. తాగునీరు అందడం లేదు. పది రోజులకో సారి సరఫరా చేస్తున్న నీటి కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది’ అని ఆ రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తలాపున కృష్ణమ్మ..  తాగు నీరు లేదమ్మా!
దోమలపెంటలో అసంపుర్తిగా ఉన్న మిషన్‌ భగీరథ నీటి శుద్ధి కేంద్రం

దోమలపెంట, ఈగలపెంట ప్రజల ఆవేదన

ఆరేళ్లుగా ‘మిషన్‌ భగీరథ’ పనులు

యాభై ఏళ్లుగా నెట్టుకొస్తున్న అధికారులు

పగిలిన పైపులు, పాకర పట్టిన సంపులు

పది రోజులకు ఒకసారి నీటి సరఫరా

దోమలపెంట ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : తలాపునే కృష్ణమ్మ పారుతున్నా.. తాగునీరు అందడం లేదు. పది రోజులకో సారి సరఫరా చేస్తున్న నీటి కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది’ అని ఆ రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా సరిహద్దులో, శ్రీశైలా నికి వెళ్లా దారిలో, కృష్ణానదికి సమీపంలో ఉన్న దోమలపెంట, ఈగలపెంట గ్రామాల దుస్థితి ఇది. 1966లో శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో అధికారులు, కార్మికులు, కూలీల ఆవాసం కోసం ప్రాజెక్టు కాలనీలుగా ఏర్పాటైన ఈ ఊర్లు కాలక్రమంలో గ్రామపంచా యతీలుగా మారాయి. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో కాలనీల నిర్వహణ, నీటి సరఫరా కొనసాగుతుండేది. తాగునీరు సరఫరా కోసం కృష్ణానది నుంచి ఈ కాలనీలకు ఏర్పాటు చేసిన పైపు లైన్‌ ప్రస్తుతం దెబ్బతి న్నది. దానినే మరమ్మతు చేస్తూ అరకొరగా నీరు సరఫరా చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో గతంలో 18 మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తు తం ఒక ఇంజనీరు, ఒక సహాయకుడు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం దోమలపెంట, ఈగలపెంట గ్రామాలకు జెన్‌కో అధ్వర్యంలో కృష్ణానది నుంచి మృగవాణి అతిథి గృహం వరకు నీరు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి దోమలపెంటకు 10 రోజులకు ఒక సారి నీరు అందిస్తున్నారు. గ్రామం లో ఉన్న బోర్ల ఉంచి అప్పుడప్పుడు నీటిని సరఫ రా చేస్తున్నారు.

పూర్తికాని ‘మిషన్‌ భగీరథ’ పనులు

దోమలపెంట, ఈగల పెంట గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందించేందుకు 2020లో రూ. 6.58 కోట్ల నాబార్డు నిధులతో మిషన్‌ భగీరథ పథకం పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణానది నుంచి దోమలపెంట వ రకు 3.5 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు చేసి, గ్రామంలో ఇంటింటికీ నల్లాలు బిగించి తాగునీరు అందించాలన్నది పథకం ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగా ప్రభుత్వం టెండర్లు పి లిచి కాంట్రాక్టర్లకు పనులను అప్పగించింది. 2023, ఆగస్టు నాటి కి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా, నేటికి పూర్తి కాలేదు. కాంట్రా క్టర్‌ నాసిరకమైన పైపులను వేయడంలో ఇప్పటికే జాయింట్లు ఊడిపోయాయి. ఇళ్ల ముందు ఇష్టానుసారంగా పైపులు వేయ డంతో వాటిపై నుండి కార్లు, బైకులు తిరిగి నలిగిపోయాయని, మరికొన్ని చోట్ల విరిగి పోయాయని స్థానికులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో దోమలపెంటకు చెందిన కటకం వెంకటేశ్‌, రాముల మ్మ ఫౌండేషన్‌ ద్వారా స్థానికులకు తాగునీరు సరఫరా చేస్తు న్నారు. ఇంటికి రెండు డ్రమ్ముల నీటితో పాటు, మూడు బబు ల్స్‌ ఫిల్టర్‌ నీటిని అందిస్తున్నారు.

తాగునీరు లేక ఇబ్బందులు

తాగు నీటి కోసం పది సంవత్సరా లుగా ఇబ్బంది పడుతున్నాం. సమస్య పరిష్కరించాలని అధికారులు, నాయ కులకు పలుమార్లు చెప్పినా ప్రయో జనం లేదు. దాతలు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తుండటంతో కొంత ఊరట కలుగుతోంది. అధికారులు స్పందించి ప్రతీ రోజు తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి.

- గాలెమ్మ, దోమలపెంట

ఎమ్మెల్యే చొరవ చూపాలి

గత ప్రభుత్వం మిషన్‌ భగిరథ పథ కం ఏర్పాటుకు నిధులను కేటాయిం చింది. ఇప్పటివరకు 80 శాతం పను లు పూర్తయ్యాయి. గత ఏడాది నుంచి కాంట్రాక్టర్‌ పనులు సక్రమంగా చేయక పోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంతో మిగతా పనులు పూర్తి కావడం లేదు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి సమస్యను పరిష్కరించాలి.

- బుదాల ప్రసాద్‌, మాజీ ఉప సర్పంచ్‌, దోమలపెంట

3 నెలలో పనులు పూర్తి

మిషన్‌ భగీరథ పనులను 3 నెలల్లోగా పూర్తి చేసి దోమలపెంట, ఈగలపెంట గ్రామాలకు నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.

- హేమలత, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ

Updated Date - Apr 18 , 2025 | 11:35 PM