Share News

కనుల పండుగగా కోటి దీపోత్సవం

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:33 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి పట్టణంలోని రామలింగేశ్వరస్వామి, పాలెంలోని వేంక టేశ్వరస్వామి ఆలయాల ఆవరణల్లో సోమవారం రాత్రి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చారు.

కనుల పండుగగా కోటి దీపోత్సవం
పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగిస్తున్న భక్తులు

బిజినేపల్లి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి పట్టణంలోని రామలింగేశ్వరస్వామి, పాలెంలోని వేంక టేశ్వరస్వామి ఆలయాల ఆవరణల్లో సోమవారం రాత్రి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు తరలివచ్చి దీపాలు వెలిగించారు. బిజినేపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది. అంతకు ముందు ఆలయ పూజారులు కార్తీక దీపం విశిష్టతను వివరించారు.

Updated Date - Nov 10 , 2025 | 11:33 PM