Share News

‘జాగృతి జనంబాట’కు కవిత రాక

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:08 PM

జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పర్యటనకు గ ద్వాలకు రానున్నారు.

 ‘జాగృతి జనంబాట’కు కవిత రాక

- నేడు, రేపు అలంపూరు, గద్వాలలో పర్యటన

- సాగునీరు, రైతాంగ సమస్యలపై చర్చ

- విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ఎన్‌హెచ్‌పీఎస్‌

గద్వాల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పర్యటనకు గ ద్వాలకు రానున్నారు. జాగృతి జనంబాటకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి పూర్తి మద ్దతు తెలిపి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఆది వారం ఉదయం 9గంటలకు బీచుపల్లికి చేరుకోనున్న కవితకు ఘనంగా స్వాగతం పల కనున్నట్లు ఎన్‌హెచ్‌పీఎస్‌ అ ధ్యక్షుడు గొంగళ్ల రంజిత్‌ కు మార్‌ తెలిపారు. అక్కడి నుంచి అలంపూర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన 100పడకల ఆసుపత్రిని పరిశీలిస్తారు. ఆ తర్వాత రాజోలి మండలంలో ని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథ కాన్ని పరిశీలించి ఏవిధంగా సాగునీరు అందిస్తున్నారో తె లుసుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం అయిజకు చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడుతారు. ఆ తర్వాత మల్దకల్‌లోని స్వ యంభూ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం అమరవాయి గ్రామానికి చేరుకొని అక్కడ భోజనం చేస్తారు. సాయం త్రం గద్వాల పట్టణంలో చేనేత కార్మికులతో ఛాయ్‌పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తారు. గ ద్వాలలో చేనేత కార్మికులు ఎదుర్కొనే సమస్యలపై తెలుసుకుంటారు. అనంతరం మన్నాపురం మీదుగా గుడ్డెందొడ్డికి చేరుకొని అక్కడ సమావేశం నిర్వహిస్తారు. రెండవ రోజు సోమవారం గట్టు ఎత్తిపోత ల పథకం, ర్యాలంపాడు రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వా త గద్వాలకు చేరుకొని గంజ్‌రోడ్డులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో సీడ్‌పత్తి రైతులతో సమావేశం అవుతారు. న డిగడ్డలో ఆర్గనైజర్ల దోపిడీకి పత్తి రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో వారితో మాట్లాడి తెలుసుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడి హైదరాబాద్‌కు వెళుతారని నడిగడ్డహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Dec 20 , 2025 | 11:08 PM