ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:22 PM
జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచే ప్రజలు ఆలయాలకు వెళ్లి దైవదర్శనాలు చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. కృష్ణానది, తుంగభద్ర నదీతీర గ్రామాల్లోని ఆలయాల్లోనూ దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.