Share News

కలాన్ని ఆయుధంగా మార్చుకున్న కాళోజీ

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:11 PM

కలాన్ని ఆయుధంగా మార్చుకొని, తన కవి త్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

కలాన్ని ఆయుధంగా మార్చుకున్న కాళోజీ
గద్వాల కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • కాళోజీ నారాయణరావు చిత్రపటానికి నివాళి అర్పించిన కలెక్టర్‌, ఎస్పీ

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కలాన్ని ఆయుధంగా మార్చుకొని, తన కవి త్వం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. మం గళవారం కలెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాకవి, పద్మవిభూషణ్‌ స్వర్గీయ కాళోజీ నారాయణరావు 111వ జయంతి సందర్బంగా కలెక్టర్‌ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరా వు, ఏవో భూపాల్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ అధికా రి అక్బర్‌పాషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఉద్యమ చైతన్యం నింపిన కాళోజీ : ఎస్పీ

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కాళోజీ జయంతి సందర్బంగా స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాళోజీ చి త్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళిఅర్పించారు. కార్యక్రమంలో ఏవో సతీష్‌కుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకటేశ్‌, ఐటీ సెల్‌ ఎస్‌ఐ షుకూర్‌, డీసీఆర్‌బీబీ ఎస్‌ఐ స్వాతి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 11:11 PM