Share News

కక్షసాధింపు చర్యలో భాగమే కాళేశ్వరం నివేదిక

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:17 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధ్దంగా ఉందని బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజకవర్గ అధ్యక్షుడు బాసు హనుమంతునాయుడు అన్నారు.

కక్షసాధింపు చర్యలో భాగమే కాళేశ్వరం నివేదిక

  • బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజకవర్గ అధ్యక్షుడు బాసు హనుమంతునాయుడు

  • పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను వీక్షించిన బీఆర్‌ఎస్‌ నాయకులు

గద్వాల న్యూటౌన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా ఎదుర్కొనేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధ్దంగా ఉందని బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజకవర్గ అధ్యక్షుడు బాసు హనుమంతునాయుడు అన్నారు. కాళేశ్వరంపై అబద్ధపు ప్రచారాలు నిర్వహిస్తూ, ఇచ్చిన హామీలు అమలు చేయక కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కాలయాపనపై మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా ద్వారా మంగళవారం హైదరాబాద్‌ కేంద్ర, కార్యాలయ తెలంగాణ నుంచి నిర్వహించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ద్వారా జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి బాసుహనుమంతునాయుడు వీక్షించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడు తూ కాళేశ్వరంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో హరీశ్‌రావు కుండబద్ధలు కొట్టారన్నారు. 60ఏళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్క పనికూ డా పూర్తిచేయలేదన్నారు. కేసీఆర్‌ కేవలం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి చరిత్రలో నిలిచారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమం లో నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, చక్రధర్‌రావు, రాఘవేంద్రరెడ్డి, అంగడి బస్వరా జు, పటేల్‌ జనార్దన్‌రెడ్డి, అతికూర్‌ రహెమాన్‌, మోనేష్‌, బీచుపల్లి, గంజిపేట రాజు, కుర్వ పల్లయ్య, టవర్‌ మక్బూల్‌, వెంకటేష్‌నాయుడు, కామేశ్‌, శ్రీరాములు ఉన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 11:17 PM