స్థానిక రిజర్వేషన్లలో ఎస్సీలకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:05 AM
స్థానిక సంస్థల ఎన్నికలో కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్లలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
గద్వాల టౌన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికలో కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్లలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రక్రియపై ఆయన అనామానం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని డీకే బంగ్లాలో విలేకరు ల సమావేశం ఏర్పాటు చేసి రామాంజనేయు లు మాట్లాడారు. జనాభా పెరుగుదల ఆధారం గా బీసీల రిజర్వేషన్ శాతం పెంచామని చెబు తున్న ప్రభుత్వం అదే రీతిలో పెరిగిన జనాభా ఆధారంగా ఎస్సీల స్థానాలు ఎందుకు పెం చలేదని ప్రశ్నించారు. ముఖ్యంగా గద్వాల ని యోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఏ ఒక్క జడ్పీస్థానం గానీ, ఎంపీటీసీ స్థానం గానీ పెరగ కపోవడం అన్యాయమేకాగా, ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కనీసం ఒక్క జడ్పీ స్థానం, ఒక ఎం పీపీ స్థానం ఎస్సీలకు కేటాయించాలని డిమాం డ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే తమ పార్టీకి ఎ స్సీల తరఫున ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతుంద న్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, శ్యామ్‌రావు, మంజుల నర సింహ, దేవదాసు, అనిల్, పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ, శ్రీనివాసులు, శోభారాణి, గాంజ సా యి, మోహన్, నరేశ్‌గౌడ్, శేఖర్, శ్రీను, శంకర్, వాసు పాల్గొన్నారు.