Share News

కాంగ్రెస్‌తోనే నిరుపేదలకు న్యాయం

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:56 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌తోనే నిరుపేదలకు న్యాయం
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

దేవరకద్ర, నవంబరు 15 (ఆంధజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం దేవరకద్ర మునిసిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి, మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. అంతకుముందు నిర్వహించిన చిన్నరాజమూర్‌ ఆంజనేయస్వామి ఉత్సవ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారులు, ఆలయ సిబ్బందికి సూచించారు. జాతర మైదానంలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం జాతర పోస్టర్‌ను విడుదల చేశారు.

Updated Date - Nov 15 , 2025 | 10:56 PM