సామాజిక తెలంగాణతోనే బడుగులకు న్యాయం
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:35 PM
సా మాజిక తెలంగాణతోనే బడుగులకు న్యా యం జరుగుతుందని రాష్ర్టీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవా యి దిలీప్ కుమార్ అన్నారు. సామాజిక ర థయాత్ర శుక్రవారం గద్వాలకు చేరుకుంది. అనంతరం హరిత హోటల్‌లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు.
- పదేళ్లు బీఆర్‌ఎస్ రాష్ర్టాన్ని లూటీ చేసింది
- ఊరికి ఐదుగురు కాంగ్రెస్‌వాళ్లు దోపిడీ చేస్తున్నారు
- రాష్ర్టీయ లోక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్
గద్వాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సా మాజిక తెలంగాణతోనే బడుగులకు న్యా యం జరుగుతుందని రాష్ర్టీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవా యి దిలీప్ కుమార్ అన్నారు. సామాజిక ర థయాత్ర శుక్రవారం గద్వాలకు చేరుకుంది. అనంతరం హరిత హోటల్‌లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తెలంగాణను సాధించుకున్న త ర్వాత సామాజిక తెలంగాణ కల సాకారం అవుతుందని భావించామని, కానీ ఒకే కుటుంబ పాలన సాగిస్తూ తెలంగాణ ను దోపిడీ చేసింద ని విమర్శించారు. అన్ని రంగాలను స ర్వనాశనం చేశారని దుయ్యబుట్టారు. వా ళ్లను దించి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే వాళ్లు ఊరికి ఐదు గురు తయారు అ య్యారని దోపిడీ చే స్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 90శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే వారంద రు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభు త్వం ప్రైవేటు పరిశ్రమలలో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇచ్చే విదంగా చట్టం తే వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 28లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇ ప్పించి సొంత పరిశ్రమలు, వ్యాపారాలు ఏ ర్పాటు చేసుకునేవిధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర నాయకులు మల్లేష్, రిషబ్ జైన్, నర్సింహ్మారావు, సుధాకర్, బుల్లెట్ వెంకటన్న, తదితరులు పాల్గొన్నారు.