Share News

వర్గీకరణతో మాదిగలకు న్యాయం

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:03 PM

వర్గీకరణతో మాదిగలకు న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

వర్గీకరణతో మాదిగలకు న్యాయం
భూత్పూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

- ఘనంగా ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

పాలమూరు/భూత్పూర్‌/గండీడ్‌/మిడ్జిల్‌/బాలానగర్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : వర్గీకరణతో మాదిగలకు న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎమ్మార్పీఎస్‌ 31వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం ఏనుగొండలో ఎమ్మార్పీఎస్‌ జెండాను మాజీ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌ ఆవిష్కరించగా, ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరై అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఏళ్ల నుంచి మాదిగలు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తించి దాని అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎమ్మార్పీఎస్‌ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్‌, రామస్వామి, కిరణ్‌, మంజుల, పురుషోత్తం, వెంకటేష్‌గౌడ్‌, శాంతికుమార్‌, రమేష్‌, జెమిని, సీహెచ్‌ వెంకటేష్‌, సాయన్న, మాధవ్‌, కరాటే శ్రీను, గోపాల్‌, గిరి పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ సంఘం స్థాపించి 31 సంవత్సరాలు పూర్తి కావడంతో ఎమ్మార్పీఎస్‌ నాయకులు భూత్పూర్‌ చౌరస్తాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లి అర్పించారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు నర్సిములు, నాయకులు యాదయ్య, వీరస్వామి, బాల్‌నాగయ్య, అబ్బాస్‌, యాదయ్య, ఎల్లప్ప, అంజి, కాశప్ప, రాము పాల్గొన్నారు. గండీడ్‌ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వెంకట్‌రాములు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్‌ జెండాను ఆవిష్కరించారు. మాజీ ఎంపీపీ లక్ష్మయ్య, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆశన్న, వెంకటయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చెన్నయ్య, ఉమ్మడి జిల్లా అంబేద్కర్‌ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొన్నారు. మిడ్జిల్‌ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగాళ్ల సురేష్‌మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ జన్మదినం, ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీపీ సుదర్శన్‌, ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గణేష్‌మాదిగతో కలిసి కేక్‌కట్‌ చేశారు. నాయకులు దేవయ్య, బాలయ్య, బుచ్చయ్య, రాజేష్‌, వెంకటయ్య, సుధాకర్‌, రాజు, వంశీ, అంజి, శ్రీధర్‌, నరసింహ, జంగయ్య, సావిత్రి, రాణి, మహేష్‌ పాల్గొన్నారు.బాలానగర్‌ మండల కేంద్రంలో ఎమార్పీఎస్‌ మండల అధ్యక్షుడు శేఖర్‌మాదిగ ఆధ్వర్యంలో పెద్దాయపల్లి చౌరస్తాలో కేక్‌ కట్‌ చేశారు. నాయకులు యాదయ్య, జగన్‌, యాదయ్య, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:03 PM