భూభారతితో రైతులకు న్యాయం
ABN , Publish Date - May 21 , 2025 | 11:01 PM
భూభారతి తో రైతులకు సరైన న్యాయం జరుగుతోందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- కొత్త చట్టం అమలు, పరిష్కార చర్యలపై సమీక్ష
మద్దూర్, మే 21 (ఆంధ్రజ్యోతి): భూభారతి తో రైతులకు సరైన న్యాయం జరుగుతోందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. భూభారతి కొత్త చట్టం అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూర్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ సమస్యలపై రైతులు అందించిన 1341 దరఖాస్తుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏడు బృందాలు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ బుధవారం సమీక్షించారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీ క్ష సమావేశంలో సమస్యల పరిష్కార పురోగ తిని అధికారులనడిగి తెలుసుకున్నారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తిర స్కరించిన దరఖాస్తుకు స్పష్టత ఉండాలని, రైతులకు సమాధానం చూపే బాధ్యత అధికా రులపై ఉందన్నారు. ఇక్కడ చూపించే పరిష్కా రం మలి దశలో ఎంపిక చేసిన మండలాల్లో కూడా అదే రకంగా ఉంటుందని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి వంద శాతం పూర్తి చేయా ల ని ఆదేశించారు. ఆర్డీవో రాంచందర్, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, మద్దూర్, కొత్తపల్లి, కోస్గి, గుండుమాల్ తహసీల్దార్లు మహేష్‌గౌడ్, జయరాములు, శ్రీనివాస్, దయాకర్‌రెడ్డి, రెవె న్యూ అధికారులు పాల్గొన్నారు.