సంఘటితశక్తిగా మారితేనే బీసీలకు న్యాయం
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:33 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షతో అడుగడుగు నా మోసానికి గురవుతున్న బీసీలు సంఘటిత శక్తిగా మారితనే తగిన న్యాయం లభిస్తుందని బీసీ కుల సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ బాబు అన్నారు.
జేఏసీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ బాబు
రిజర్వేషన్ సాధన కోసం బీసీ సంఘాల సదస్సు
గద్వాల టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షతో అడుగడుగు నా మోసానికి గురవుతున్న బీసీలు సంఘటిత శక్తిగా మారితనే తగిన న్యాయం లభిస్తుందని బీసీ కుల సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ బాబు అన్నారు. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఆదివారం పట్టణంలోని వాల్మీకి భవన్ బీసీ కుల సంఘా లు, ప్రజాసంఘాల జిల్లాస్థాయి సదస్సు నిర్వ హించారు.సదస్సులో మాట్లాడిన వక్తలు, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పి స్తూ తెచ్చిన జీవోను న్యాయం స్థానం రద్దు చే యడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈబీసీలకు రిజర్వేషన్ కల్పించిన నాడే 50 శా తం నిబంధన వీగిపోయిందని, బీసీ రిజర్వేషన్ పెంచడం వల్ల ని బంధనల ఉల్లంఘన జరుగు తుంటూ వస్తున్న వాదన అర్థంలే నిదన్నారు. కాగా, ఈబీసీ రిజర్వేష న్ల కోసం ఆగమేఘాల మీద ఆమో దం తెలిపిన కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహ రించడం అన్యాయమన్నారు. బీసీ కులగణన పట్ల ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ కాల యాపన చేస్తున్న పాలకులు ఇప్పటికైనా బీసీ లకు న్యాయం చేయాలన్నారు. దేశ జనాభాలో 60శాతానికి పైగా ఉన్న బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసి రా జ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చడం దార్వా బీసీలకు తగిన న్యాయం చేయాలన్నారు. సదస్సులో ఆంజనేయులు, ప్రభాకర్, అచ్చన్న గౌడ్, కురువ పల్లయ్య, మోహన్, ఉప్పేరు నరసింహ, రిటైర్డ్ డీఎస్పీ కృష్ణమూర్తి, అతిక్‌ఉర్ రెహమాన్, వాల్మీకి, వినోద్, గోపాల్ యాదవ్, కోళ్ల హుసేన్, రంగు మద్దిలేటి, మక్బుల్, దాన య్య, రాంబాబు ఉన్నారు.