Share News

హెచ్‌సీఏ 2డే లీగ్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ గెలుపు

ABN , Publish Date - Oct 21 , 2025 | 10:55 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) బి-డివిజన్‌ 2డేలీగ్‌ టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు 8 వికెట్ల తేడాతో నిజాం కాలేజ్‌పై విజయం సాధించింది.

హెచ్‌సీఏ 2డే లీగ్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ గెలుపు
విజయసంకేతం చూపిస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు క్రీడాకారులు

- 8 వికెట్ల తేడాతో నిజాం కాలేజీపై విజయం

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) బి-డివిజన్‌ 2డేలీగ్‌ టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు 8 వికెట్ల తేడాతో నిజాం కాలేజ్‌పై విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ గ్రీన్‌ వివ్‌- 3 మైదానంలో మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన నిజాం కాలేజీ జట్టు 31.5 ఓవర్లలో 55 పరుగులకు కూప్పకూలింది. జిల్లా బౌలర్‌ ముఖీద్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 8 వికెట్లు తీసి రాణించాడు. కె. శ్రీకాంత్‌, శాశంక్‌ చేరో వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జట్టు 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. జట్టులో కే. శ్రీకాంత్‌ 23, అబ్దుల్‌రాఫె 23 పరుగులు చేశారు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ముఖీద్‌ను క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ అభినందించారు.

Updated Date - Oct 21 , 2025 | 10:55 PM