శాంతికి ప్రతిరూపం ఏసుక్రీస్తు
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:40 PM
ప్రపంచ శాంతికి ప్రతిరూపం ఏసుక్రీస్తు అని పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు.
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
- శుభాకాంక్షలు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ శాంతికి ప్రతిరూపం ఏసుక్రీస్తు అని పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్‌లోని ఎంబీ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపి, మాట్లాడుతూ క్రీస్తు తన బోధనల ద్వారా ప్రపంచ మానవాళికి శాంతి, ప్రేమను పంచారన్నారు. ఆయన చూపిన మార్గాన్ని ఆచరిస్తే ప్రపంచంలో శాంతి వెల్లివిరుస్తుందన్నారు.
క్రీస్తు జీవితమే మహోన్నత సందేశం
క్రీస్తు జీవితమే సమాజానికి దిశానిర్దేశం చేసే మహోన్నత సందేశమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని కల్వరి, ఎంబీ, మోతీనగర్‌లోని బేతెస్థ హోలీ, క్రిస్టియన్‌పల్లిలోని ఎంబీ బెత్తెహాం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా చర్చిలలో క్రైస్తవ సోదరులకు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపి, మాట్లాడారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, త్యాగం సేవ వంటి సార్వత్రిక విలువలను ప్రతీ ఒక్కరు ఆచరించినప్పుడే సమాజంలో శాంతి, ఐక్యత, మానవత్వం నెలకొంటాయన్నారు. నగర ప్రజలందరూ సరిసంపదలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిం చారు. క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన విందులో పాల్గొని ప్రజలకు వడ్డించారు. అనంతరం క్రిస్మస్ కెక్‌ను కట్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్ స్వగృహంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఎంబీ చర్చిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రిస్మస్ వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో రెవరెండ్ వరప్రసాద్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, పార్టీ సీనియన్ నాయకులు మిథున్ రెడ్డి, వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనితారెడ్డి, సామ్యూల్ దాసరి, జాకబ్, డేవిడ్, హెడ్విన్ రాజు, డానియల్, రాజురాణి, స్టీఫెన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, షబ్బీర్ అహ్మద్, రాషెద్ ఖాన్, కృష్ణయ్య యాదవ్, అర్షద్, అంజద్, షెక్ ఉమర్ పాల్గొన్నారు.