Share News

నేడు జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:00 PM

జవహర్‌ నవోద య విద్యాలయంలో ఒక్కసారి సీటు ల భిస్తే ఆరో తరగతి మొదలుకొని 12వ తర గతి వరకు నిశ్చింతగా చదువుకునే అవ కాశం ఉంది.

 నేడు జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్ష

- ఉమ్మడి జిల్లాలో 29 కేంద్రాలు

- హాజరుకానున్న 7115 మంది విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, డిసెం బరు 12 (ఆంధ్రజ్యోతి): జవహర్‌ నవోద య విద్యాలయంలో ఒక్కసారి సీటు ల భిస్తే ఆరో తరగతి మొదలుకొని 12వ తర గతి వరకు నిశ్చింతగా చదువుకునే అవ కాశం ఉంది. ఇది పేద విద్యార్థులకు వ రం లాంటిది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాగర్‌కర్నూల్‌ జిల్లా వట్టెం, మ హబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జవహర్‌ నవోదయ విద్యాలయాలు కొనసాగుతు న్నాయి. ప్రతీ ఏటా జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశం కో సం నిర్వహించే భారీగా పోటీ పెరుగుతు న్నది. ఆరో తరగతి ప్రవేశం కోసం ఉమ్మ డి జిల్లాలో 120 సీట్లు భర్తీ చేయనున్నా రు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచే పరీక్ష రాసే విద్యార్థులు 90 సీట్లు గ్రామీ ణ ప్రాంత విద్యార్థుల కు, 30 పట్టణ ప్రాంత విద్యార్థులకు మెరిట్‌ మా ర్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తా రు. ఈ పరీక్ష శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్న 1.30 వ రకు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొ త్తం 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 7115 మంది విద్యార్థులు హాజరు కానున్నా రు. మొత్తంగా పరీక్ష సజావుగా ని ర్వహించేందుకు జవహర్‌ నవోదయ విద్యాలయం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి

నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని , ఆలస్యం అయితే పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు. పరీక్ష కేంద్రాలను ముందుగానే గుర్తుంచుకోవాలి. హడావుడి ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడతారు. ప్రశాంతంగా పరీక్షకు హాజరుకావాలి.

- భాస్కర్‌, జవహర్‌ నవోదయ ప్రిన్సిపాల్‌

Updated Date - Dec 12 , 2025 | 11:00 PM