Share News

అండర్‌ 23 క్రికెట్‌ 2డే లీగ్‌లో జడ్చర్ల జట్టు విజయం

ABN , Publish Date - May 31 , 2025 | 11:04 PM

అండర్‌ 23 క్రికెట్‌ 2డే లీగ్‌ మ్యాచ్‌లో జడ్చర్ల జట్టు విజయం సాధించింది.

అండర్‌ 23 క్రికెట్‌ 2డే లీగ్‌లో జడ్చర్ల జట్టు విజయం
విజయం సాధించిన జడ్చర్ల జట్టు

జడ్చర్ల, మే 31 (ఆంధ్రజ్యోతి) : అండర్‌ 23 క్రికెట్‌ 2డే లీగ్‌ మ్యాచ్‌లో జడ్చర్ల జట్టు విజయం సాధించింది. హైదరాబాద్‌ క్రికెట్‌ ఆసోషియేషియన్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన జడ్చర్ల - వనపర్తి జట్ల మధ్య జరిగిన 2 డే క్రికెట్‌ మ్యాచ్‌ హోరాహోరిగా సాగింది. శుక్రవారం జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో వనపర్తి జట్టుపై 126 పరుగుల అధిక్యాన్ని జడ్చర్ల జట్టు సాధించింది. శనివారం జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జడ్చర్ల జట్టు 31.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి డిక్లెర్‌ చేసింది. తదుపరి బ్యాటింగ్‌ చేసిన వనపర్తి జట్లు 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది, జడ్చర్ల జట్టు రెండు ఇన్నింగ్స్‌లో వనపర్తి జట్టుపై 146 పరుగులతో విజయం సాధించింది. జడ్చర్ల జట్టులో కేతన్‌ అనే బ్యాట్స్‌మెన్‌ 108 పరుగులు సాధించాడు. కోచ్‌లు హహేష్‌, ముజీబ్‌ పర్యవేక్షించారు.

Updated Date - May 31 , 2025 | 11:04 PM