ప్రజాస్వామ్య రక్షణ కోసం ‘జై బాపు, జైభీమ్, జై సంవిధాన్’
ABN , Publish Date - May 28 , 2025 | 11:34 PM
ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘జై బాపు, జైభీమ్, జై సంవిధాన్’ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎక్సైజ్, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ ర్యాలీలో మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, మే 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘జై బాపు, జైభీమ్, జై సంవిధాన్’ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎక్సైజ్, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామం నుంచి నార్లాపూర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎల్టూరు గ్రామంలో గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం ఎల్లూరు నుంచి నార్లాపూర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ స్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగా హన పెంచడమే ఈ ర్యాలీ లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహు ల్ గాంధీ, ‘జై బాపు, జైభీమ్, జై సంవిధాన్’ నినాదానికి పిలుపునిచ్చారని అన్నా రు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తోందన్నారు. అమిత్‌షా పార్లమెంట్ సాక్షిగా అంబేడ్కర్‌ను అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత స్వయంగా కేసీఆర్ చుట్టు దెయ్యాలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ చుట్ట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కవిత ప్రకటించాలని జూపల్లి డిమాండ్ చేశారు. కార్య క్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు హనుమంత్ నాయక్, మాజీ సర్పంచ్‌లు శేఖర్‌రెడ్డి, మేకల నాగరాజు, బచ్చలకూర బాలరాజు కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.