Share News

జగదీశ్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:46 PM

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను అవమానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మహమ్మదాబాద్‌, గండీడ్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కేఎం నారాయణ, జితేందర్‌రెడ్డి, పీసీసీ నాయకుడు పీఈటీ రాములు డిమాండ్‌ చేశారు.

జగదీశ్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి
మహబూబ్‌నగర్‌-చించోళీ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ రాస్తారోకో

మహమ్మదాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను అవమానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మహమ్మదాబాద్‌, గండీడ్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కేఎం నారాయణ, జితేందర్‌రెడ్డి, పీసీసీ నాయకుడు పీఈటీ రాములు డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని నంచర్ల గేట్‌ వద్ద మహబూబ్‌నగర్‌-చించోళీ జాతీయ రహదారిపై మహమ్మదాబాద్‌, గండీడ్‌ మండలాల కాంగ్రెస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేసీఆర్‌ డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ మొదటి నుంచి దళితలను చిన్నచూపు చూసిందన్నారు. అసెంబ్లీలో దళిత బిడ్డ స్పీకర్‌గా ఉండటం చూసి ఓర్వడం లేదని మండిపడ్డారు. జగదీశ్‌రెడ్డికి మద్దతుగా కేటీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ శాంతిరంగ్యా, నాయకులు బాల ముకుందం, లక్ష్మికాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 10:46 PM