జడ్చర్ల బైపా్‌స రోడ్డు నిర్మించాలి
ABN , Publish Date - May 05 , 2025 | 11:26 PM
సమగ్రాభివృద్ధిలో భాగంగా జడ్చర్ల బైపా్‌స రోడ్డును నిర్మించాలనే వినతిపై కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వినతి
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
జడ్చర్ల, మే 5(ఆంధ్రజ్యోతి): సమగ్రాభివృద్ధిలో భాగంగా జడ్చర్ల బైపా్‌స రోడ్డును నిర్మించాలనే వినతిపై కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి తెలిపారు. సోమవారం తెలంగాణ పర్యటనకు వచ్చిన గడ్కరీని కన్హాశాంతివనం వద్ద జడ్చర్ల బైపాస్ రోడ్డు విషయంపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి వినతిపత్రం అందజేసినట్లు అనిరుధ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. జడ్చర్ల-హైదరాబాద్ జాతీయ రహదారి 44ను.. జడ్చర్ల-కల్వకుర్తి జాతీయ రహదారి 167తో అనుసంధానం చేస్తూ ఈ బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరామని చెప్పారు. దినదినాభివృద్ధి చెందుతున్న జడ్చర్ల అరబిందో ఫార్మా, పెట్రోకెమికల్స్, హెటిరో, హిందూస్థాన్, అన్‌లీవర్ వంటి సుప్రసిద్ధమైన పరిశ్రమలకు నెలవుగా ఉందన్నారు. నర్సి మాంజీ యూనివర్సిటీ, స్వామి నారాయణ్ గురుకుల్, ఉడ్ ల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ వంటి విద్యాసంస్థలతో ఎడ్యుకేషనల్ హబ్‌గా ఉందని గడ్కరీకి వివరించారు. దీంతో పాటు అలంపూర్ జోగుళాంబ శక్తిపీ ఠం, మంత్రాలయం, గంగపురం లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయాలకు వెళ్లడానికి ప్రధాన రోడ్డు ఇదని తెలిపారు. 44, 167 జాతీయ రహదారులతో పాటు వనపర్తి-జడ్చర్ల వెళ్లే 23వ నంబర్ స్టేట్ హైవే రోడ్డు, రైల్వే డబుల్ లైన్ కూడా ఉందని వివరించారు. దాంతో జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోందన్నారు. ఈ రద్దీని నివారించడానికి నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 167ను అ నుసంధానిస్తూ 4 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారు. ఇది జడ్చర్ల ప్రాంత అభివృద్ధిలో మరో కలికితురాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ విషయంపై గడ్కరీ సానుకూలంగ స్పందించారని, రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు.