Share News

కురుమూర్తి జాతరకు వేళాయె..

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:39 PM

కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానుండడంతో జాతర మైదానంలో సందడి నెలకొంది.

కురుమూర్తి జాతరకు వేళాయె..
జాతర మైదానంలో వెలిసిన రంగుల రాట్నాలు

- మైదానంలో వెలుస్తున్న గుడారాలు

- 22 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు

చిన్నచింతకుంట, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానుండడంతో జాతర మైదానంలో సందడి నెలకొంది. జాతరకు దుకాణాదారులు, పాలకవర్గం సిద్ధమయ్యారు. బ్రహ్మోత్సవాలతో పాటు జాతరకు కూడా జనం అధికంగా వస్తారు. కురుమూర్తి జాతరకు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన స్థానం ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద జాతరగా పేరుంది. దాదాపు బ్రహ్మోత్సవాలు, జాతర 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఇప్పటికే జాతర మైదానంలో గుడారాలు వెలుస్తున్నాయి. హోటల్స్‌, రంగులరా ట్నాలు, సర్కస్‌, వివిధ రకాల స్టాల్స్‌, మాంసం దుకాణాలను ఏర్పాటు చేయడంలో వ్యాపారులు, నిర్వాహకులు పనులను పూర్తి చేస్తున్నారు. దుకాణాదారులు కూడా తమ స్థలాల్లో ముళ్లపొదలను, పిచ్చి మొక్కలను తొలగిస్తూ చదును చేస్తు దుకాణాలను వే సుకుంటున్నారు. ప్రస్తుతం జాతర మైదానం అంతా కళకళలాడుతుంది.

Updated Date - Oct 16 , 2025 | 11:39 PM