Share News

పాయలా.. మారిందిలా..

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:32 PM

వర్షాకాలం ప్రారంభమైన వెంటనే వరద జలాలతో నిండు కుండలా కళకళలాడే సోమశిల కృష్ణానది వేసవి ఆరంభంలోనే అడుగంటి పోయి వెలవెలపోతున్న ది.

 పాయలా.. మారిందిలా..
అడుగంటిపోయిన సోమశిల కృష్ణానది

- అడుగంటిన సోమశిల కృష్ణానది

- నాడు జలకళ.. నేడు వెలవెల

- ఉమ్మడి జిల్లా వాసులకు వేసవిలో తప్పని తాగు, సాగునీటి కష్టాలు

- ఈ ఏడాది ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా 47 టీఎంసీల నీటి వినియోగం

కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ప్రారంభమైన వెంటనే వరద జలాలతో నిండు కుండలా కళకళలాడే సోమశిల కృష్ణానది వేసవి ఆరంభంలోనే అడుగంటి పోయి వెలవెలపోతున్న ది. పాయలా మారి ప్రవహిస్తుండటం చూసి కొ ల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలు, పర్యాటకులు విస్తు పోతున్నారు. మరో మూడు నెలల పాటు ఉండే వే సవిలో తాగు, సాగు నీటి కష్టాలు తప్పవని ఆందో ళన చెందుతున్నారు. గడిచిన వర్షాకాలం ప్రా రం భం మొదలు.. నేటి వరకు ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవ సరాలకు ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 47 టీఎంసీలు వినియోగించినట్లు అధికారులు పేర్కొం టున్నారు.

ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ఒకటి, రెండు, నా లుగో మోటార్‌ల ద్వారా నీటి వినియోగం యథావి ధిగా కొనసాగుతూనే వచ్చింది. మరో వారం రోజు ల పాటు నీటి సరఫరా కొనసాగుతుంది. ప్రస్తుతా నికి తాగు, సాగు నీటి కష్టాలు ఉండవని అధికారు లు చెబుతున్నా.. వచ్చే మూడు నెలల పాటు ఉ మ్మడి జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు మాత్రం తప్పవని పలువురు పేర్కొంటున్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ కేంద్రం పరిధిలోని ఎల్లూరు మిషన్‌ భగీరథ పథకానికి ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా తా గునీటి అవసరాల కోసం నీటి పంపింగ్‌ చేస్తారు.. అక్కడ ఫిల్టర్‌ చేసి నీటిని ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిఽ దిలో 19 మునిసిపాలిటీలకు 18 నియోజకవర్గాల్లో ఉన్న 88 మండలాలకు ఆరు జిల్లాల పరిధిలో ఉ న్న 4వేల ఆవాసావాలకు ఇక్కడి నుంచే మిషన్‌ భ గీరథ పథకం ద్వారా నీటి పంపిణీ కొనసాగుతుం ది. ప్రస్తుతం ఎల్లూరు మిషన్‌ భగీరథ పథకానికి నిత్యం ఎంజీఎల్‌ఐ పథకం ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నప్పటికీ రాబోయే మూడు నెలలు కీలకం కానున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలకు తాగు నీరు అందించే కృష్ణానది జలాలు ఈ ఏడాది అను కున్న దానికన్నా ఎక్కువగా అడుగంటి పోవడంతో కష్టాలు తప్పవని స్పష్టమవుతున్నది. ప్రస్తుతం వే సవి కాలం పంటలు చివరి దశలో ఉన్నప్పటికీ ఎం జీఎల్‌ఐ పథకం ద్వారా పంపింగ్‌ అయిన నీటి వి డుదలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుం టలు నిండి ఉన్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌తో పాటు సింగోటం శ్రీవారి సముద్రం, జొన్నలబొగుడ రిజర్వాయర్‌లలో నీటి నిల్వ ఉన్న ప్పటికీ రాబోయే పంటలకు రైతులకు అది పూర్తి సరిపోను ఉండదని రైతులు భావి స్తున్నారు. ఇప్ప టికే ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా 47 టీఎంసీలు నీటి వినియోగం జరిగిందని, మరో వారం రోజుల పాటు ప్రాజెక్టు ద్వారా నీటి పంపింగ్‌ కొనసాగు తుందని అధికారులు స్పష్టం చేశారు.

ప్రారంభమైన తాగునీటి కష్టాలు..

వేసవి ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇప్పటికే తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. రానున్న మూడు నెలల వేసవి కాలంలో తాగు నీటి కష్టాలు మరింత జఠిలం కానున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలకు తాగునీ టి కష్టాలు తలెత్తకుండా అధికారులు ప్రజాప్రతినిధులు ముందస్తు జాగ్రత్త లు చేపట్టడం అనివార్యం కానుంది. ఇప్పటికే కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిఽ దిలో 20 వార్డుల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రోజు విడిచి రోజు నీ టి సరఫరా అవుతున్నా అవి కూడా సరిపడా కావడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. అదే విధంగా కొల్లాపూర్‌ మునిసిపాలిటీలో ప్రతి రోజు 45 లక్షల లీటర్ల నీటి వినియోగం ఉన్నప్పటికీ కేవలం 28 లక్షల లీటర్లు మాత్ర మే సరఫరా అవుతుందని, ఇది మునిసిపల్‌ ప్రజలకు సరిపోవడం లేదని ప ట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. మరో వైపు కొల్లాపూర్‌ మండల పరిధిలోని నల్లమల గ్రామాలైన ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, కుడికిళ్ల, నార్లాపూర్‌ గ్రామాల్లో కూడా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఆయా గ్రామాల్లో ప్రజ ల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసా గుతుంది. వేసవి ముగిసేంత వరకు ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Updated Date - Apr 09 , 2025 | 11:32 PM