సాంకేతికతపై విధిగా అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:36 PM
నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవడం విద్యార్థులకు అనివార్యమని ప్రి న్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అన్నారు.
ప్రిన్సిపాల్ షేక్ కలందర్ బాషా
గద్వాల టౌన్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవడం విద్యార్థులకు అనివార్యమని ప్రి న్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అన్నారు. సమాజ పురోగతి, మనుగడ, సాంకేతికతపైనే ఆధారపడిన నేపథ్యంలో విద్యార్థులు తమ నైపు ణ్యానికి పదను పెట్టాలన్నారు. గురువారం గద్వాల ప ట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్‌కేసీ, ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో సోహం అకాడమీ రోబోటిక్స్ ఇన్ అకడమిక్ వారు రోబోటిక్స్ టెక్నాలజీపై ఒక్కరో జు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు రోబోటిక్స్ ప్రదర్శనలో పాల్గొని సం స్థ అకడమిక్ టీం చీఫ్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పలుప్రదర్శనలను స్వయంగా నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన పవన్‌కుమార్, రోబోటిక్స్ పరికరాలను ఉపయోగించే విధానం గురించి వారికి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. కార్యక్రమానికి 145 మంది విద్యార్థులు హాజరుకాగా వారందరికీ ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాధిక, టీఎస్‌కేసీ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తెమ్మ, మెంటార్ సుబ్రమణ్యం, అధ్యాపకులు డాక్టర్ వెంకటేశ్వరమ్మ, హరిబాబు, కృష్ణయ్య, లలిత, రమాదేవి, శంకర్, ఆనంద్‌కుమార్ ఉన్నారు.