Share News

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పడం విడ్డూరం

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:10 PM

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నాం అని ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బాసు హనుమంతునాయుడు పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పడం విడ్డూరం

  • బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బాసు హనుమంతునాయుడు

గద్వాల న్యూటౌన్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బాసు హనుమంతునాయుడు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ఇచ్చిన నిర్ణయంపై ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నాడని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నాం అని ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటే గత సెప్టెంబరులో గద్వాల పర్యటనకు కేటీ ఆర్‌ వచ్చినప్పుడు సభకు ఎందుకు రాలేదని, ఇటీవలే జరిగిన స్థానిక సంస్ధల సర్పంచు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి, మీ ఫొటో పెట్టుకొని గ్రామాల్లో ప్రచా రం చేసి గెలిచారని దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిమిషానికి ఒక మాట మారుస్తున్నారని, ఈ విషయంపై స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్‌పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:10 PM