Share News

ఉపాధి హామీ దక్కేనా?

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:09 PM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మహాత్మాగాంధీ పేరుకు బదులు విబ్‌జీ రామ్‌జీని చేర్చడం ఒక అంశమైతే.. ఇంకా పథకంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయోనన్న చర్చ సర్వత్రా నెలకొంది.

ఉపాధి హామీ దక్కేనా?
మిడ్జిల్‌లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు(ఫైల్‌)

పథకంలో చోటుచేసుకోనున్న మార్పులు

100 నుంచి 125 రోజులకు పనిదినాల

పెంపునకు కసరత్తు .. రోజు కూలి రూ.325కు..

రాష్ట్రం వాటాతో నిధుల కేటాయింపు ఇబ్బందికరమే

నిర్మాణాత్మక పనులపై దృష్టి

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మహాత్మాగాంధీ పేరుకు బదులు విబ్‌జీ రామ్‌జీని చేర్చడం ఒక అంశమైతే.. ఇంకా పథకంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయోనన్న చర్చ సర్వత్రా నెలకొంది. రెండు దశాబ్దాల క్రితం నాటి యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. మార్పులు జరిగితే కొన్ని ప్రతికూలతలు, మ రికొన్ని అనుకూలతలు ఉండనున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంఽధించాలన్న డిమాండ్‌ ఓవైపు ఉం డగా, మార్పుల తరువాత ఉన్న పనులు నీరుగారే ప్రమాదముందన్న చర్చ సాగుతోంది. ప్ర స్తుతం కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి నిధులు కేటాయించే ఈ పథకంలో ఇప్పుడు కేంద్రం, రాష్ట్ర వాటాలు ఉండాలని నిర్ణయించనుండటంతో నిధుల కొరతతో ముందుకు సా గుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం చేపట్టే పనుల్లో చాలావరకు నిర్మాణాత్మకమైన పనులు లేకపోవడంతో కొత్తగా వచ్చే మార్పులలో నిర్మాణాత్మకమైన పనులను ఎక్కువగా చేయించాలన్న ఆలోచన చేస్తున్నారు.

పథకంలో 2.20 లక్షల మంది కూలీలు

పాలమూరు జి ల్లాలో ఉపాధి హామీ పథకంలో 2.20 లక్షల మంది జాబ్‌కార్డు కూ లీలు ఉన్నారు. అం దులో లక్ష మంది రె గ్యులర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో పనిదినాల సం ఖ్య 50 శాతం కుదించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 32.43 లక్షల పనిదినాలు కల్పించగా, 32.69 లక్షల పనిదినాలు పనిచేశారు. అదే 2025- 26 సంవత్సరానికి కేవలం 17.78 లక్షల పనిదినాలు మా త్రమే కల్పించడం గమనార్హం. గడిచిన ఐదేళ్లలో ఇంత తక్కువ పనిదినాలు కల్పించడం ఇదే మొదటిసారి. అదే 2023-24 సం వత్సరంలో 31.05 లక్షల పనిదినాలు కేటాయించగా 35.13 లక్ష లు, 2022- 23లో 28.06 లక్షల పని దినాలకు 31.68 ల క్షలు, 2021-22లో 35. 97 లక్షల పనిదినాలకు 36. 89 లక్షలు, 2020-21లో 41.86 లక్షల పనిదినాలకుగాను 40.44 లక్షల పని దినాలు చేశారు. ఇప్పుడు పథకంలో మార్పులు చేర్పులు చేస్తుండటంతో భవిష్యత్తులో ప థకం ఎలా ఉంటుందోనని మార్గదర్శకాల కోసం అధికార యంత్రాంగం ఎదురు చూ స్తోంది. కొత్త నిబంధనలు వస్తే ఈ మాత్రం పనులైనా చేస్తారో లేదో చూడాలి.

125 రోజుల పనిదినాలు.. కూలీ రూ.325

పథకానికి ఇప్పటివరకు మొత్తం కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తోంది. ఇప్పుడు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటా భరించాలని తెస్తున్న నిబంధనలు పథకం అమలుకు ప్రతిబంధకాలుగా మారనున్నాయి. రాష్ట్రాలు అంతమొత్తం భరించి పథకాన్ని ఇదివరకు తరహాలో కొనసాగిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న పనుల్లోనూ మార్పులు చేర్పులు జరుగనున్నాయి. ప్రస్తుతం 100 రోజుల పని దినాలే చేస్తున్నారు. జాబ్‌కార్డులో నలుగురు వ్యక్తులుంటే ఒక్కొకరు ఏడాదికి 25 రోజులు, ఇద్దరు ఉంటే 50 రోజుల పాటు పనిచేసుకునే అవకాశం ఉంది. అదే కొత్తచట్టంలో 100 నుంచి 125 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజు కూలి రూ.325కు పెంచాలని భావిస్తున్నారు. ఇది కూలీలకు కొంత ఉపయోగకరం కానుంది. ఇప్పటికే పనిదినాలు పెంచాలని పెద్దఎత్తున డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై సానుకూలత వ్యక్తం అవుతుంది.

గరిష్ఠంగా రూ.239.61 కూలి

జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు సగటున రూ.239.61 కూలి పడింది. గడిచిన ఆరేళ్లలో ఇదే ఎక్కువ కావడం విశేషం. 2024-25లో సగటున రూ.210, 2023-24లో రూ.190.63, 2022-23లో రూ.179.85, 2021-22లో రూ. 189.34 కూలి పడింది. కూలీ ధర పెరిగితే సగటున మరింత ఎక్కువ గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది.

Updated Date - Dec 20 , 2025 | 11:09 PM