Share News

ధ్యాసంతా దోచుకోవడంపైనేనా ?

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:28 PM

గడిచిన పదేళ్లలో గద్వాల నాయకులు బాగుపడ్డారు తప్ప నడిగడ్డ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు.

 ధ్యాసంతా దోచుకోవడంపైనేనా ?
ధర్నాలో మాట్లాడుతున్న ఎంపీ డీకే అరుణ

- కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో పాలమూరు ఎంపీ డీకే అరుణ

- పార్టీలు మారడం తప్ప గద్వాలలో అభివృద్ధే లేదు

- కోర్డు నిర్మాణంలోనూ రాజకీయం అవసరమా..

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): గడిచిన పదేళ్లలో గద్వాల నాయకులు బాగుపడ్డారు తప్ప నడిగడ్డ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం గద్వాల జిల్లాలోని ప్రజా సమస్యలపై బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ముందు ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె మాట్లాడారు. ఇక్కడున్న ప్ర జాప్రతినిధులకు కండువాల మీదున్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదన్నారు. తుమ్మిళ్ల, నెట్టెంపా డు, గట్టు ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తిచేయలేదని మండిపడ్డారు. ర్యాలంపాడు, జూరాల ప్రాజెక్టు లీకేజీల సమస్యలు ఎందుకు సరిచేయలేదన్నారు. నేను గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప మీరెక్కడ రోడ్లు వేశారో చూపాలన్నారు. కోర్టు నిర్మాణంలో రాజకీయం చేయడం తగదన్నారు. లాయర్ల మనోభావాలను గౌరవించి పాత కోర్టు ఉన్నచోటే కొత్త భవనం నిర్మాంచాలన్నారు. అలాగే ప్రధాని మోదీ తల్లి గురించి రాహుల్‌ గాంధీ అభ్యంతరక వ్యాఖ్యలు చేయడాన్ని మహిళల అందరి తరుపున ఖండిస్తున్నామని, వెంటనే రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని డి మాండ్‌ చేశారు. అనంతరం గద్వాల జిల్లా సమస్యలపై కలెక్టర్‌ బీఎం సంతోష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో గద్వాల జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి వీరేంద్రగౌడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్‌ సెక్రటరీ డీకే. స్నిగ్ధ్దారెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్లు బండల వెంకట్రాములు, రమాదేవి తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:28 PM