Share News

నేటి నుంచి సాగునీరు నిలిపివేత

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:31 PM

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిని దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల పాటు వదిలిన సాగునీటిని గురువారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ జగన్మోహన్‌ తెలిపారు.

నేటి నుంచి  సాగునీరు నిలిపివేత
ఎడమ కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వైపు వెళ్తున్న కృష్ణానది నీరు

అమరచింత, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిని దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల పాటు వదిలిన సాగునీటిని గురువారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ జగన్మోహన్‌ తెలిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంగళవారం, బుధవారాలు ఎడమ కాలువ నుంచి 550 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ నుంచి 350 క్యూసెక్కులు మొత్తం 0.2 టీఎంసీల నీటిని వదిలారు. బుధవారం సాయంత్రంతో రెండు రోజులు గడువు ముగియడంతో గురువారం నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని పూర్తిగా నిలిపివే యనున్నారు. ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని వేసవిలో తాగునీటి పథకాలకు ఉపయోగించనున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:31 PM