Share News

ప్రతీ ఎకరాకు సాగునీరు

ABN , Publish Date - May 26 , 2025 | 11:40 PM

ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి భీడు భూములను సైతం సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ప్రతీ ఎకరాకు సాగునీరు
గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ ఫేజ్‌-1 నుంచి నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ ఫేజ్‌-1 నుంచి సాగునీరు విడుదల

ధరూరు, మే 26 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి భీడు భూములను సైతం సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని గుడ్డెందొడ్డి సమీపంలో నెట్టెంపాడు ఎత్తిపోతల ఫథకం ఫేజ్‌-1 పంప్‌హౌస్‌ వద్ద ఆయన స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. అనం తరం గంగమ్మకు పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వా యర్‌ నుంచి కాలువల ద్వారా చెరువులు, కుంటలు నింపుతామన్నారు. ఈ ఏడా ది ముందస్తు వర్షాలతో కృష్ణానదిలో నీటి సామర్థ్యం పెరగింది. దీంతో గుడ్డెందొ డ్డి రిజర్వాయర్‌ ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. అదే విధంగా రెండు పంటలకు నీటిని అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నాలుగు టీఎంసీల సామర్థ్యం గల ర్యాలంపాడు రిజర్వాయర్‌లో రెండు టీఎంసీల నీటి నిలువ ఉంచుతామన్నారు. మిగిలిన వాటిలో కొంత ఇబ్బంది ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. త్వరలోనే రిజర్వాయర్‌ పనులు పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేం దుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రామన్‌గౌడ, సీనియర్‌ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీలు సుదర్శన్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కురువ హనుమంతు, నీటిపారుదల శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:40 PM