Share News

ఆర్డీఎస్‌ కాలువకు లీకేజీ రోడ్డుపైకి చేరిన సాగునీరు

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:05 AM

ఆర్డీఎస్‌ కాలువకు సాగునీరు రావడంతో రై తులు సంతోషానికి బదులు ఇబ్బందిపడు తున్నారు.

ఆర్డీఎస్‌ కాలువకు లీకేజీ రోడ్డుపైకి చేరిన సాగునీరు
రోడ్డుపై పారుతున్న ఆర్డీఎస్‌ కాలువ నీరు

మానవపాడు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆర్డీఎస్‌ కాలువకు సాగునీరు రావడంతో రై తులు సంతోషానికి బదులు ఇబ్బందిపడు తున్నారు. డీ-30 కాలువకు లీకేజీలు ఏర్పడ డంతో ఈ కాల్వకు వదిలిన సాగునీరంతా వృ థా అవుతున్నది. అలాగే రోడ్లపైకి కూడా చే రుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. మండల పరిధిలోని నారాయణపురం వెళ్లే రోడ్డు వద్ద లీకేజీ అధికంగా ఉండటంతో రోడ్డుపైకి నీరు చేరి, గ్రామంలో నుంచి వాగు లోకి పారుతున్నాయి. గత ఏడాది నుంచి డీ-30 కాలువలో జమ్ము పేరుకుపోవడం వ ల్ల ఈపరిస్థితి ఏర్పడింది. తొలగించడం గు రించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏవి ధంగా మారుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించి కాలువలో చెత్తాచెదారం, జమ్ము తొలగించేందుకు చర్యలు తీసుకోవాల ని కోరుతున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 12:05 AM